
బిగ్ బాస్ 3 తెలుగు విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరిగింది. గచ్చిబౌలీలోని ప్రిజం పబ్‌లో బుధవారం అర్థరాత్రి ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కొంతమంది వ్యక్తులు ఆయనపై బీరుబాటిళ్లతో దాడి చేశారు. ఆయన తలపై కూడా బీరు సీసాతో కొట్టడంతో రాహుల్ తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయాడు. వెంటనే రాహుల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీ ద్వారా రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి చేసింది MLA రోహిత్ రెడ్డి బంధువులని పోలీసులు తేల్చారు. అమ్మాయి విషయంలో రాహుల్ గ్రూప్‌కు మరియు MLA రోహిత్ రెడ్డి బంధువుల గ్రూప్‌కు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ గొడవ గురించి రాహుల్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. తనకు చిన్న గాయం మాత్రమే అయిందని ఆయన పోలీసులకు తెలిపారు. దాంతో పోలీసులు ఈ గొడవపై సుమోటోగా కేసు నమోదు చేయడానికి సన్నద్ధమవుతున్నారు.