దొంగతనం నెపంతో యూపీలో దళిత బాలికపై దాడి 

 దొంగతనం నెపంతో యూపీలో దళిత బాలికపై దాడి 

ఉత్తరప్రదేశ్ లో దళిత బాలికను హింసించిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. అమేఠీలో దళిత మైనర్ బాలికను దొంగతనం నెపంతో హింసించారు. ఇద్దరు కాళ్లను ఒడిసిపట్టుకోగా... మరో వ్యక్తి కర్రతో అరికాళ్లపై కొట్టడం, జుట్టు పట్టకుని హింసించడం చేశాడు. అదే టైమ్ లో ముగ్గురు మహిళలు ఆ బాలికను ప్రశ్నించడం వీడియోలో కనిపించింది. తాను దొంగతనం చేయలేదని ఎంత వేడుకుంటున్నా కనికరించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో, SC/ST చట్టాల కింద FIR రిజిస్టర్ చేశారు. నమన్ సోనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మిగతావారిని కూడా అరెస్ట్ చేస్తామని అమేఠీ పోలీసులు తెలిపారు. ఈ విషయంలో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. ఉత్తరప్రదేశ్ లో దళితులు, మహిళకు భద్రతలేదని మరోసారి రుజువైందన్నారు. UPలో సగటున రోజుకు 34 కుల ఉన్మాద ఘటనలు, 135 మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసులో వీలైనంత త్వరగా చర్యలు చేపట్టకపోతే... ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్రియాంక.

 

https://twitter.com/amethipolice/status/1475897054547243011

 

మరిన్ని వార్తల కోసం..

రైతులను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రులు