‘డాన్‌‌‌‌‌‌‌‌’ ఆఫీస్‌‌‌‌‌‌‌‌పై దాడి

‘డాన్‌‌‌‌‌‌‌‌’ ఆఫీస్‌‌‌‌‌‌‌‌పై దాడి

లండన్‌‌‌‌‌‌‌‌ ఎటాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘పాకిస్తానీ’ అని రాసినందుకే

ఆందోళనకు దిగిన గుర్తు తెలియని వ్యక్తులు

ప్లకార్డులు పట్టుకుని నిరసన

సారీ చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌

ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ డైలీ న్యూస్‌‌‌‌‌‌‌‌పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘డాన్‌‌‌‌‌‌‌‌’ ఆఫీసు ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు ఆందోళన చేశారు. లండన్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిపై ఎటాక్‌‌‌‌‌‌‌‌ చేసిన వ్యక్తి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన వాడని రాసినందుకు నిరసనగా ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌లోని పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట ప్లకార్డులు పట్టుకుని పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వార్త రాసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని అన్ని పేపర్లు లండన్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిపై దాడికి పాల్పడిన ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ బ్రిటన్‌‌‌‌‌‌‌‌కు చెందిన వాడని, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో అతడికి సంబంధం లేదని వార్తలు పబ్లిష్‌‌‌‌‌‌‌‌ చేశాయి. డాన్‌‌‌‌‌‌‌‌ మాత్రం “ దాడి చేసింది పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో పుట్టిన యూకే నేషనలిస్ట్‌‌‌‌‌‌‌‌ ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌” అని రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. దానికి నిరసనగా కొంత మంది ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌లోని పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు చేరుకుని దాడి చేసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ వాళ్లను అడ్డుకున్నారు.  దాదాపు మూడు గంటలపాటు ఉద్యోగులను కూడా బయటకు రానీయకుండా నిర్బంధించారని డాన్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పింది. గేటు బయట కొంత మంది జర్నలిస్టులతో ఆందోళనకారులు దురుసుగా  ప్రవర్తించారని పేర్కొన్నారు. పోలీసులు ఎంటరై పరిస్థితి సరిదిద్దారు. లండన్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి దగ్గర దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఇద్దరు చనిపోయారు. మరి కొంత మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో పెరిగిన ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ అనే టెర్రరిస్ట్‌‌‌‌‌‌‌‌ ఆ దాడికి పాల్పడ్డాడని స్కాట్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ యార్డ్‌‌‌‌‌‌‌‌ యాంటీ టెర్రరిస్ట్‌‌‌‌‌‌‌‌ అధికారులు చెప్పారు.

దాడిని ఖండించిన రాజకీయనాయకులు

డాన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళన చేయడాన్ని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఖండించారు. మీడియాపై దాడి చేసే హక్కు ఎవరికీ లేదని పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ పీపుల్స్‌‌‌‌‌‌‌‌ పార్టీ (పీపీపీ) చైర్మన్‌‌‌‌‌‌‌‌ బిల్వాల్‌‌‌‌‌‌‌‌ భుట్టో జర్దారీ అన్నారు. ఆందోళనకారులపై యాక్షన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీనిపై హైలెవెల్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌ జరపాలని పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ముస్లిం లీగ్‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌‌‌‌‌ ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ మర్రియుమ్‌‌‌‌‌‌‌‌ ఔరంగజేబ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. జర్నలిస్టుల ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌పై ఆంక్షలు పెట్టొద్దని, మీడియాపై దాడి చేసే వాళ్లను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.