వీఎం హోంలో అనాథ పిల్లలపై దాడి చేస్తే ఊరుకోం: ఓల్డ్ స్టూడెంట్లు

వీఎం హోంలో అనాథ పిల్లలపై దాడి చేస్తే ఊరుకోం: ఓల్డ్ స్టూడెంట్లు
  • వీఎం హోంలో అనాథ పిల్లలపై దాడి చేస్తే ఊరుకోం: ఓల్డ్ స్టూడెంట్లు
  • సరూర్​నగర్ విక్టోరియా మోమోరియల్  హోం భూముల కబ్జాకు కుట్ర : ఓల్డ్ స్టూడెంట్లు
  • ముదురుతున్న స్టూడెంట్లు, వాకర్స్, పోలీస్ కోచింగ్ 
  • అభ్యర్థుల మధ్య వివాదం

ఎల్ బీ నగర్,వెలుగు: సరూర్​నగర్​లోని విక్టోరియా మెమోరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వీఎం) హోంలో అనాథ పిల్లలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హోం ఓల్డ్ స్టూడెంట్లు హెచ్చరించారు.  ప్రస్తుతం అక్కడ ఉంటోన్న స్టూడెంట్లపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు, ఓల్డ్ స్టూడెంట్ల అసోసియేషన్ సభ్యులు తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. వీఎం హోం గ్రౌండ్​లోకి ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులు, వాకర్స్, పోలీస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ అభ్యర్థులు వస్తున్నారన్నారు. వాకింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ పేరుతో వచ్చి హోంలో  ప్రస్తుతం చదువుతున్న స్టూడెంట్లపై దాడులు చేస్తున్నారన్నారు. ఎల్ బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే వీఎం హోం స్థలాన్ని వాకర్స్ ట్రాక్​గా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సుధీర్ రెడ్డి దగ్గరుండి హోం స్థలంలోకి బల్దియాకి చెందిన జేసీబీని తీసుకురావడంపై  ఓల్డ్ స్టూడెంట్లు , హోం పర్యవేక్షణ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. హోంలో చదువుకునే అనాథ స్టూడెంట్లపై  ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాడి చేయడంపై సరూర్ నగర్  పీఎస్​లో కంప్లయింట్ చేశామన్నారు. వీఎం హోం 73 ఎకరాల్లో విస్తరించి ఉందని హోం సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు హోంకు చెందిన స్టూడెంట్లు ఎక్సర్ సైజ్ చేస్తుండగా.. అదే టైమ్​లో కోచింగ్ సెంటర్ అభ్యర్థులు గ్రౌండ్ లోపలికి దూసుకొచ్చి ఇద్దరిని గాయపర్చారన్నారు. ప్రైవేటు వ్యక్తులు ఇక్కడికి ఎలా వస్తారని ఆమె ప్రశ్నించారు. 

వీఎం హోం ఆస్తులను కాపాడే బాధ్యత మాకుంది : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

వీఎం హోం ఆస్తులను కాపాడే బాధ్యత తమకు ఉందని  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత హోం నిర్వాహకులదన్నారు.  ఏవో కారణాలు చెప్పి తప్పించకోవద్దన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు 45 రోజుల ప్రాక్టీస్ కోసం గ్రౌండ్​కు వస్తున్నారన్నారు.  వారంతా వివిధ ప్రాంతాల నుంచి కోచింగ్ కోసం సిటీకి వచ్చిన పేదలని.. సరైన గ్రౌండ్ లేక రోడ్లపైనే ప్రాక్టీస్ చేస్తూ గాయపడుతున్నారన్నారు. వారి ప్రాక్టీస్​కు సహకరించేందుకే వీఎం హోం గ్రౌండ్​లో పేరుకుపోయిన చెత్తను క్లీన్​ చేసేందుకు జీహెచ్​ఎంసీకి చెందిన జేసీబీని తీసుకొచ్చామన్నారు.