హోం మేడ్​ డ్రోన్​తో రష్యా నేవీపై ఎటాక్

హోం మేడ్​ డ్రోన్​తో రష్యా నేవీపై ఎటాక్

కీవ్​: రష్యా నల్ల సముద్రానికి సంబంధించిన నౌకదళ హెడ్​ క్వార్టర్​పై డ్రోన్​ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. క్రిమియా ద్వీపం.. సెవాస్టోపోల్​ నగరంలోని ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. దీన్ని 2014లో ఉక్రెయిన్​ నుంచి రష్యా స్వాధీనం చేసుకుంది. నల్ల సముద్రం నౌకదళ ప్రెస్​ సర్వీస్​ అధికారులు దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. హోం మేడ్​ డ్రోన్​తో దాడి జరిగిందని వివరించారు. తక్కువ శక్తిగల పేలుడు జరిగిందని ప్రకటించారు. గాయపడిన వారిని హాస్పిటల్​కు తీసుకెళ్లామని సెవాస్టోపోల్​ మేయర్​ తెలిపారు.