మెహిదీపట్నం, వెలుగు: కుల్సుంపురా పోలీస్స్టేషన్పరిధి పురానాపూల్ మఠంలోని సాధువులపై శనివారం కొందరు భూ కబ్జాదారులు దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. మఠంలో ప్రభు ప్రశాంత్ దాస్ సాధువుతోపాటు మరికొందరు ఉంటున్నారు. అయితే, ఈ మఠం స్థలాన్ని కొందరు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. కోర్టులో కేసు కూడా నడుస్తోంది.
సదరు స్థలానికి దూల్పేట్ కు చెందిన అజయ్ సింగ్ తాళం వేయడంతో ఇరువర్గాల మధ్య శనివారం సాయంత్రం గొడవ జరిగిందని సీఐ రాములు తెలిపారు. ఈ ఘటనలో సాధువులతోపాటు అజయ్ సింగ్ కు కూడా గాయాలైనట్లు పేర్కొన్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
