విద్యార్థులపై దాడి.. కాకతీయ యూనివర్శిటీలో ఉద్రిక్తత 

విద్యార్థులపై దాడి.. కాకతీయ యూనివర్శిటీలో ఉద్రిక్తత 

వరంగల్: కాకతీయ యూనివర్శిటీలో  విద్యార్థులపై  దాడికి దిగారు నాన్ బోర్డర్స్ . స్పోర్ట్స్  విభాగంలో అమ్మాయిలకు  ట్రాక్ సూట్స్  పంపిణీ విషయంలో  గొడవ జరిగింది.  స్పోర్ట్స్   డైరక్టర్ ను ప్రశ్నించినందుకే  బయటి వ్యక్తులను  పిలిపించి..తమపై  దాడికి చేశారని  బాధితులు తెలిపారు. కాకతీయ యూనివర్శిటీ  పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు విద్యార్థులు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో విద్యార్థులపై నాన్ బోర్డర్స్ దాడి చేయడం వివాదస్పదంగా మారింది. స్పోర్ట్స్ విభాగంలో అమ్మాయిలకు ట్రాక్ సూట్స్ పంపిణీ చేయాలనీ….. తన సోదరిపై లైంగిక వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్ వెంకటేష్ … స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ లాల్ ను డిమాండ్ చేయడంతో గొడవ మొదలైంది.  స్పోర్ట్స్ డైరక్టర్ ను ప్రశ్నించినందుకే బయటి వ్యక్తులను పిలిపించి..తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు. స్పోర్ట్ ఆడిన విద్యార్ధులకు సర్టిఫికెట్స్ ఇస్తుండగా… ట్రాక్ షూట్ ఎందుకు ఇవ్వట్లేదని  ప్రశ్నించినందుకు డైరెక్టర్ సురేష్ లాల్ తమని బెదిరించారని విద్యార్ధులు చెబుతున్నారు.

కేయూలోనికి నాన్ బోర్డర్స్ తో పాటు తన అనుచరులతో ఈ దాడి చేయించినట్టు ఆరోపించారు. వెంకటేష్ అనే విద్యార్థిని గదిలో వేసి చితకబాదినట్టు చెబుతున్నారు. డైరెక్టర్ సురేష్ లాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ లాల్ మాత్రం ఈ గొడవ విషయంలో తానేమీ మాట్లాడననీ…తనకీ ఆ గొడవకు సంబందం లేదని చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులతో పాటు కేయూ రిజిష్ట్రార్ కి కంప్లయింట్ చేశారు విద్యార్థులు.  డైరెక్టర్ సురేష్ లాల్ పై చర్యలు తీసుకోని.. సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.