
హైదరాబాద్: కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధి బాలాపూర్‌లో సమోసా అడిగినందుకు కస్టమర్‌పై హోటల్ సిబ్బంది దాడి చేశారు. హోటల్ సిబ్బంది అకారణంగా కొట్టారని గుల్సన్ కాలనీకి చెందిన కస్టమర్ మహమ్మద్ ఫిరోజ్ ఆరోపిస్తున్నాడు. గాయాల కారణంగా ఆయన ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు