బర్త్ డే పార్టీలో.. తలపై బీర్ బాటిల్స్ పగులగొట్టారు

బర్త్ డే పార్టీలో.. తలపై బీర్ బాటిల్స్ పగులగొట్టారు

స్నేహితులతో కలిసి చేసుకున్న బర్త్ డే పార్టీలో గొడవ రాజుకుంది. జన్మదిన వేడుకలలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి పై దాడికి దారి తీసింది. ఈ సంఘటన జగద్గిరి గుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎలమ్మబండలో నివసించే శివ తన జన్మదిన వేడుకలను అంబీర్ చెరువు కట్ట కింద సెలబ్రేట్ చేసుకున్నాడు. గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఈ వేడుకల్లో మద్యం సేవించిన వారంతా  గొడవకు దిగారు. ఈ క్రమంలో మాటా మాటా పెరగటంతో సాయి రెడ్డి అనే యువకుడిపై బీరు బాటిళ్లతో దాడి చేశారు. బీరు బాటిళ్లను సాయి రెడ్డి తలపై పగులగొట్టారు.దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సాయి రెడ్డిని చికిత్స నిమిత్తం కెపిహెచ్ బి లోని రేమాడి  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

గ్రేటర్​ పరిధిలో భారీగా ఏపీ ఓటర్లు

ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య