
మెదక్ (మనోహరాబాద్), వెలుగు: రంజాన్ సందర్భంగా నమాజ్ చేసి వెళ్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన అప్జల్ కుటుంబ సభ్యులు స్థానిక ఈద్గా వద్ద నమాజ్ చేసి.. పెద్దల గోరీల వద్ద పూలు పెట్టేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. అఫ్టల్, మున్వర్, గౌస్, ముదాసిర్‌తో పాటు మొత్తం 15 మందిని తేనెటీగలు కరిచాయి. గాయపడిన వారిలో కొందరు స్థానికంగా ట్రీట్మెంట్ తీసుకోగా, మరి కొందరు మేడ్చల్ మెడినోవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని జడ్పీ చైర్‌పర్సన్ హేమలత, సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి పరామర్శించారు.