బీసీ బంద్లో దాడులు.. 8 మంది అరెస్ట్

బీసీ బంద్లో దాడులు.. 8 మంది అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: బీసీ బంద్​ నేపథ్యంలో శనివారం పలు షాపులపై దాడులు చేసిన 8 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాచిగూడ పీఎస్ పరిధిలోని బర్కత్ పురా చౌరస్తా వద్ద హెచ్​పీ పెట్రోల్ పంపు, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్​పై బీసీ సంఘాల నేతలు దాడులు చేశారన్నారు. వారిని ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.

అరెస్ట్ అయిన వారిలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ (56), పి. రాందేవ్ మోదీ (30), రాంకోటి ముదిరాజ్ (47), సాయి నిఖిల్ (21), టి. రాజ్ కుమార్ (45), కె. సాయిబాబా (30), పి. తేజా (31), ఏ రామ్మూర్తి గౌడ్ (39) ఉన్నారు. ఈ 8 మందికి వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరు పరచగా , జడ్జి బెయిల్ మంజూరు చేశారు.