జూబ్లీహిల్స్, వెలుగు: ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లేందుకు ఓ దొంగ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిత్య నగర్లో గల ఎస్బీఐ ఏటీఎం సెంటర్లోకి మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. మెషీన్ను పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ మెషీన్ ధ్వంసం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఏటీఎం ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారి కె.శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
