
సుమధుర ఆర్ట్స్ అకాడమీ గురువు శ్రవ్య మానస శిష్య బృందం ‘నీలమేఘ శ్యామ’ పేరుతో ప్రదర్శించిన నృత్య రూపకం వీక్షకుల చూపులను కట్టిపడేసింది. అకాడమీ వేసవి శిక్షణా శిబిరం ముగింపు ఉత్సవాన్ని సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 200 మంది చిన్నారులు కృష్ణ భగవానుని లీలామృతంలోని ముఖ్య ఘట్టాల్ని కండ్లకు కట్టారు. హావభావాలతో ఆకట్టుకున్నారు.