
హైదరాబాద్, వెలుగు : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్‌గా అతుల్ జైన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అతుల్ జైన్ నియామకం జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని తెలిపారు. పదవిలో ఉన్నంత కాలం ఆయనకు నెలకు రూ.2.24 లక్షల వేతనం ఉంటుందని చెప్పారు.