ఈవీ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలో ఆకట్టుకున్న ఆటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైక్స్

ఈవీ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలో ఆకట్టుకున్న ఆటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైక్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ఈవీ ఇండియా 2021 ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలో ఎలక్ట్రిక్ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటమ్ మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొంది. సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంటు ఈవీల బ్యాటరీలను చార్జ్ చేయగల చార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, తన ఎలక్ట్రిక్ బైకును ఆటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక్కడ ప్రదర్శిస్తోంది. సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లతో కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమయం, డబ్బు ఎలా ఆదా అవుతుందో వివరించింది. ఈ సందర్భంగా ఆటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ‘‘మా డెమోకు మంచి స్పందన వచ్చింది. సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఉచితంగా బైకులను చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. ఇది పేటెంటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ. మా చార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లలో వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లలో కస్టమర్ ఆఫీసు పనులు చేసుకునేందుకు సదుపాయాలు కల్పించాం. దేశమంతటా ఆటమ్ షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, చార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇది వరకే  500 బైకులను అమ్మాం. మరో 500 మంది నుంచి ఎంక్వైరీలు వచ్చాయి. కాలుష్యం బెడద నుంచి తప్పించుకోవాలన్నా, పర్యావరణానికి మేలు చేయాలన్న ఈవీలకు మారడం బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’’ అని ఆయన వివరించారు.ఈ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ షోలో ఈవీ కంపెనీలు తమ ప్రొడక్టులు, ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మార్ట్  నెక్స్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెన్ మొబిలిటీ టెక్నాలజీలు, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లు, స్కూటర్, మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిల్, సైకిళ్లు, బస్సులు మొదలైన వాటిని చూపిస్తున్నాయి.    ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీతో, కస్టమర్లతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే కోసం ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోను వేదికగా మార్చుకున్నాయి. ఈ నెల 26 వరకు కార్యక్రమం కొనసాగుతుంది.

ఈవీలకు అద్భుత భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు పెరుగుతుండటంతో మన దేశంలో ఈవీలకు అద్భుత భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని ఆటో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారు. కేంద్రం ఈవీలను ప్రోత్సహిస్తోంది. ఫేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వంటి స్కీముల వల్ల మనదేశం  గ్లోబల్ ఎలక్ట్రిక్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.  పెరుగుతున్న కాలుష్యాన్ని,  చమురు ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈవీలు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి వీటికి ఏటా డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతూనే ఉంది. “ ఎలక్ట్రిక్ కార్లు, బైకులపై జనానికి ఆసక్తి పెరుగుతోంది.  కేంద్రం ఈవీలను ఎంతగానో ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది.  ఇక నుంచి అన్ని కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ఈవీలను మాత్రమే వాడనున్నారు. 2070 నాటికి నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-జీరో ఎమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడానికే ఈ ప్రయత్నం. రాబోయే మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులతోపాటు, వీటి ఫీల్డ్ ఆఫీసుల్లోనూ ఈవీలు ఉంటాయి’’ అని ఈవీ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఒక సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.