ఆ రెండు బ్యాంకులు ఒక్కటయ్యాయి.. అవి ఏంటంటే...

ఆ రెండు బ్యాంకులు ఒక్కటయ్యాయి.. అవి ఏంటంటే...


మరో రెండు బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం లభించగా.. ఏప్రిల్ 1 న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో.. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విలీనం పూర్తయింది. అయితే ఈ బ్యాంకుల విలీనంతో.. ఏం జరుగుతుంది.. వడ్డీ రేట్లు ఎలా వర్తిస్తాయి.. ఇప్పటికే లోన్లు, డిపాజిట్లు చేస్తున్నవారు ఏం చేయాలి తెలుసుకుందాం.

మరో రెండు బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం లభించగా.. ఏప్రిల్ 1 న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో విలీనం గురించి వెల్లడించాయి బ్యాంకులు. కొంతకాలంగా బ్యాంకుల విలీనం ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని బ్యాంకులు ఒక సమూహంగా ఏర్పడుతున్నాయి. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పటిలా కాకుండా ఈ విలీనం ప్రక్రియ త్వరగానే ముగుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కూడా వేగంగానే లభిస్తున్నాయి. తాజాగా.. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో.. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విలీనం పూర్తయింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇదే మొట్ట మొదటి విలీనం కావడం గమనార్హం. ఆర్బీఐ కొద్ది రోజుల కిందటే ఈ విలీన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

ఇప్పటికే విలీనం గురించి రెండు బ్యాంకులు.. తమ వెబ్‌సైట్లలో, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించాయి. పూర్తిగా షేర్ల విలీన పద్ధతిలో జరిగే ఈ లావాదేవీ 2023 అక్టోబర్ 29న మొదటిసారిగా ప్రకటించారు.  కాస్త ఆలస్యంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం కూడా లభించింది. ఇటీవలే ఆర్బీఐ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

ఏప్రిల్ 1 నుంచి ఇకపై ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కనిపించదన్నమాట. ఫిన్‌కేర్‌కు మొత్తం 59 లక్షల మందికిపైగా కస్టమర్లు ఉండగా.. వారంతా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సర్వీసుల్ని వినియోగించుకోనున్నారు. ఫిన్‌కేర్ బ్యాంక్ కస్టమర్లకు అందరికీ.. ఇకపై ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లే వర్తిస్తాయి. ఏప్రిల్ 1 కి ముందు ఫిన్‌కేర్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసుకున్న వారికి మెచ్యూరిటీ వరకు అవే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

 షేర్ల విషయానికి వస్తే.. ఫిన్‌కేర్ బ్యాంక్ వాటాదారులకు తమ షేర్లకు బదులు ఇప్పుడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లను కేటాయిస్తారు. ఫిన్‌కేర్ బ్యాంకులో ఉన్న ప్రతి 2 వేల షేర్లకు ఇప్పుడు 579 AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు వస్తాయి. ఇంకా.. రెండు బ్యాంకుల విలీనంతో.. మొత్తం కోటి మందికిపైగా కస్టమర్లు, 43 వేల మందికిపైగా ఉద్యోగులు సహా భారత్ వ్యాప్తంగా మొత్తం 2350 టచ్ పాయింట్లు ఉండనున్నాయి.

ALSO READ :- ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల... పులివెందులపై సస్పెన్స్

ఈ బ్యాంకుల విషయానికి వస్తే.. AU బ్యాంక్ 2017 ఏప్రిల్‌లో.. ఫిన్‌కేర్ బ్యాంకు అదే సంవత్సరం జులైలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రారంభించాయి. గతేడాది డిసెంబర్ 31 వరకు ఏయూ బ్యాంక్ ఆస్తుల విలువ రూ. 1.01 ట్రిలియన్లు కాగా.. ఏయూ బ్యాంక్ షేరు ప్రస్తుతం రూ. 590.50 వద్ద ఉంది. మార్కెట్ విలువ రూ. 39.51 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 813.40 కాగా.. కనిష్ట విలువ రూ. 553.65 గా ఉంది.