జైలు నుంచి గృహ నిర్బంధంలోకి సూకీ

జైలు నుంచి గృహ నిర్బంధంలోకి సూకీ

బ్యాంకాక్: మయన్మార్ మాజీ నాయకురాలు, నోబెల్ బాహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీ (78)ని జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చినట్టు మిలిటరీ ప్రభుత్వం తెలిపింది. ఆమెతో పాటు మాజీ ప్రెసిడెంట్ విన్ మైంట్(72) ను జైలు నుంచి తరలించామని చెప్పింది. అయితే, వీరిని ఎక్కడికి తీసుకెళ్లారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం మయన్మార్ లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. 

మంగళవారం మధ్యాహ్నం నాటికి టెంపరేచర్లు 39 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ఖైదీల్లో వృద్ధులు, బలహీనుల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైన్యం పేర్కొంది. కాగా, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 2021లో సైన్యం దింపేసి చేతుల్లోకి తీసుకుంది.