V6 News

ఏపీకి అరబిందో ఫార్మా భారీ సాయం

ఏపీకి అరబిందో ఫార్మా భారీ సాయం

రూ. 11 కోట్ల కరోనా సాయం చేసిన అరబిందో ఫార్మా
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ధాటికి 51 వేల మందికి పైగానే మరణించారు. దాదాపు 10 లక్షల పైనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఒకటి, రెండు కేసులతో వారం క్రితం మొదలైన కరోనా పాజిటివ్ కేసులు.. వారంలోనే 150 దాటాయి. దాంతో ఏపీలో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్నారు.

అయితే కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన అరబిందో ఫార్మా ఏపీకి రూ. 11 కోట్ల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి గురువారం విజయసాయి రెడ్డి సమక్షంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి రూ. 7.50 కోట్ల చెక్కును అందజేశారు. మిగతా రూ. 3.5 కోట్ల రూపాయలకు బదులుగా విలువైన హై-ఎండ్ మెడికల్ కిట్లు, ఇతర వైద్య పరికరాలు, శానిటైజర్లు మరియు మాస్క్‌లను అందిస్తామని శరత్ చంద్రారెడ్డి సీఎంకు తెలిపారు.

For More News..

కరోనా ఎఫెక్ట్: ఈఎంఐ వాయిదాతో ఫాయిదా ఉందా?

10 లక్షల కేసులు.. 51 వేల మరణాలు