AUS vs PAK: వార్నర్, మార్ష్ సెంచరీలు.. వాడిపోయిన పాక్ బౌలర్ల ముఖాలు

AUS vs PAK: వార్నర్, మార్ష్ సెంచరీలు.. వాడిపోయిన పాక్ బౌలర్ల ముఖాలు

బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‪ ఏకపక్షంగా సాగుతోంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ సెంచరీలు బాదారు. వార్నర్ 85 బంతుల్లోనే వంద మార్క్ చేరుకోగా.. మార్ష్ 100 బంతుల్లో శాతం పూర్తి చేసుకున్నాడు. 31 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోర్.. 214/0.

మార్ష్, వార్నర్ మెరుపులు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఓపెనర్లు మార్ష్, వార్నర్.. మొదటి నుంచే ధనాధన్ బ్యాటింగ్‌తో హోరెత్తించారు. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడి.. ఏకంగా రెండు వందల పరుగులు జోడించి కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. మార్ష్ 100 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్ సాయంతో వంద మార్క్ ను చేరుకోగా.. వార్నర్  85 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇవాళ మిచెల్‌ మార్ష్‌ బర్త్‌ డే కావడం గమనార్హం. ఇక వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ఇదే అత్యుత్తమ తొలి వికెట్‌ భాగస్వామ్యం. ఇదే వేదికపై 2011లో షేన్‌ వాట్సన్‌, బ్రాడ్‌ హడిన్‌ జోడి కెనడాపై తొలి వికెట్‌ కు 183 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.