AUS vs PAK: పిచ్చ కొట్టుడు కొడుతున్నారు: పాక్ బౌలర్ల తాటతీస్తున్న ఆసీస్ ఓపెనర్లు

AUS vs PAK: పిచ్చ కొట్టుడు కొడుతున్నారు: పాక్ బౌలర్ల తాటతీస్తున్న ఆసీస్ ఓపెనర్లు

ప్రపంచ క్రికెట్‌లో తమ బౌలర్లే గొప్ప అంటూ ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఇక కనిపించకపోవచ్చు. బెంగుళూరు వేదికగా పటిష్ట ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‪లో ఆ జట్టు బౌలర్ల ప్రదర్శన ఆ రీతిలో సాగుతోంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్.. వన్డే మ్యాచ్‌ను కాస్త టీ20లా మార్చేశారు. 14 ఓవర్లు ముగిసేసరికే ఆ జట్టు స్కోర్ 120కి చేరువ అయ్యిందంటే విధ్వంసం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవాలి.

బాబర్ తప్పు చేశాడా..!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవటమే పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం చేసిన మొదటి తప్పు. క్రీజులోకి వచ్చిన ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(49; 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు ), డేవిడ్ వార్నర్(61; 45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) ధనాధన్ చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. దాయాది జట్టు బౌలర్లకు.. అంతర్జాతీయ బౌలర్లన్న కనీస మర్యాద కూడా ఇవ్వట్లేదు. ఆ జట్టు ప్రధాన పేసర్ హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. ఒక ఓవర్ నీకు.. మరో ఓవర్ నాకు అన్నట్లు పంచుకొని మరీ కొడుతున్నారు. మరో పది ఓవర్లు పాటు వీరిద్దరూ కర్రీజులో ఉంటే ఆసీస్ 400కి పైగా స్కోర్ చేయొచ్చు.