డార్విన్: సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. బ్యాటింగ్‌లో టిమ్ డేవిడ్ (52 బాల్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83), కామెరూన్ గ్రీన్ (13 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆసీస్ 17 రన్స్ తేడాతో సఫారీలపై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 లీడ్‌లో నిలిచింది.
టాస్ ఓడిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 178 రన్స్‌కు ఆలౌటైంది. 30 రన్స్‌కే మిచెల్ మార్ష్ (13), ట్రావిస్ హెడ్ (2), జోస్ ఇంగ్లిస్ (0) ఔటైనా.. గ్రీన్, డేవిడ్ నాలుగో వికెట్‌కు 40 రన్స్ జోడించారు. మిచెల్ ఒవెన్ (2), మ్యాక్స్‌వెల్ (1), ఆడమ్ జంపా (1) ఫెయిలయ్యారు. బెన్ డ్వారిషస్ (17), నేథన్ ఎలిస్ (12) ఓ మాదిరిగా ఆడారు. ఎంపాక 4, రబాడ 2 వికెట్లు తీశారు.
తర్వాత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 161/9 స్కోరుకే పరిమితమైంది. ర్యాన్ రికెల్టన్ (71) టాప్ స్కోరర్. ట్రిస్టాన్ స్టబ్స్ (37) రాణించినా మిగతా వారు నిరాశపర్చారు. హేజిల్‌వుడ్, డ్వారిషస్ చెరో మూడు, జంపా రెండు వికెట్లు పడగొట్టారు. టిమ్ డేవిడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది.
