ఇండియాతో సిరీస్ కు ఆసిస్ ఆల్ రౌండర్ గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌.. లబుషేన్ ఇన్‌‌‌‌‌‌‌‌

ఇండియాతో సిరీస్ కు ఆసిస్ ఆల్ రౌండర్ గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌.. లబుషేన్ ఇన్‌‌‌‌‌‌‌‌

పెర్త్‌‌‌‌‌‌‌‌: టీమిండియాతో ఆదివారం నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆస్ట్రేలియా ఆల్‌‌‌‌‌‌‌‌ రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామెరాన్ గ్రీన్ తప్పుకున్నాడు. గాయపడ్డ అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో క్రికెట్ ఆస్ట్రేలియా మార్నస్ లబుషేన్‌‌‌‌‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నట్టు శుక్రవారం ప్రకటించింది. గ్రీన్ పక్క కండరాల నొప్పితో (సైడ్ సోర్నెస్) బాధపడుతున్నాడు. రాబోయే యాషెస్ సిరీస్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు అతడిని ఈ సిరీస్ నుంచి తప్పించారు. 

తన ప్లేస్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగనున్న లబుషేన్ మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు.  గురువారం షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో క్వీన్స్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ తరఫున 159 రన్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. కాగా, ఇండియాతో సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌ జట్టులో ఇది మూడో మార్పు. గాయం కారణంగా వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ కూడా తొలి వన్డేకు దూరం కాగా, అతని స్థానంలో జోష్ ఫిలిప్‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నారు. స్పిన్నర్ ఆడమ్ జంపా వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో లేకపోవడంతో అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో మాథ్యూ కునెమాన్‌‌‌‌‌‌‌‌ను ఆడించనున్నారు.