పాక్​పై గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆసీస్

పాక్​పై గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆసీస్
  • వార్నర్‌ సూపర్‌ సెంచరీ
  • ఆమిర్​ మెరుపులు వృథా

టాంటన్‌‌: టీమిండియా చేతిలో కంగుతిన్న డిఫెం డింగ్‌‌ చాంపియన్‌‌ ఆస్ట్రేలియా వెంటనే పుంజుకుంది. పాకిస్థాన్‌‌పై పంజా విసిరింది. రీఎంట్రీ తర్వాత తొలి సెంచరీతో డేవిడ్‌‌ వార్నర్‌‌ అదరగొట్టగా, బౌలర్లు కూడా సత్తా చాటడంతో 41 రన్స్‌‌ తేడాతో పాక్‌‌ను ఓడించి మెగా టోర్నీలో ఆసీస్‌‌ మూడో విక్టరీ నమోదు చేసింది. లెఫ్టామ్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ అమిర్‌‌(5/30) కెరీర్‌‌ బెస్ట్‌‌ పెర్ఫార్మెన్స్‌‌తో చెలరేగినా.. బ్యాట్స్‌‌మెన్‌‌ వైఫల్యం కారణంగా టోర్నీలో పాక్‌‌ రెండో ఓటమి మూటగట్టుంది.  బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో తొలుత ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 రన్స్‌‌కు ఆలౌటైంది. ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ వార్నర్‌‌ (111 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌‌తో 107) సెంచరీ చేయగా, కెప్టెన్‌‌ ఆరోన్ ఫించ్‌‌ (82) రాణించాడు. ఛేజింగ్‌‌లో 45.4 ఓవర్లు ఆడిన పాక్‌‌ 266 రన్స్​కే ఆలౌటై ఓడిపోయింది.  ఇమాముల్‌‌( 53), హఫీజ్‌‌ (46), వాహబ్‌‌ రియాజ్‌‌( 45) పోరాడినా ఫలితం లేకపోయింది. కమిన్స్‌‌(3/33), స్టార్క్‌‌(2/43), రిచర్డ్‌‌సన్‌‌(2/62) పాక్‌‌ను దెబ్బకొట్టారు.

పాక్‌‌కు పేస్‌‌ స్ట్రోక్‌‌

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో పాక్‌‌కు సరైన ఆరంభం దక్కలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్‌‌ ఫఖర్‌‌ జమాన్‌‌(0)ను పెవిలియన్‌‌ చేర్చిన కమిన్స్‌‌ ప్రత్యర్థికి షాకిచ్చాడు.  అయితే బాబర్‌‌ అజమ్‌‌(30)తో కలిసి మరో ఓపెనర్‌‌ ఇమాముల్‌‌ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ 11వ ఓవర్‌‌లో కూల్టర్‌‌నైల్‌‌ అజమ్‌‌ను పెవిలియన్‌‌ చేర్చాడు.  ఆ తర్వాత హఫీజ్‌‌తో కలిసి ఇమాముల్‌‌  మూడో వికెట్‌‌కు 80 రన్స్‌‌ జోడించడంతో పాక్‌‌ పుంజుకుంది. కానీ,  హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఇమామ్‌‌ను ఔట్‌‌ చేసిన కమిన్స్‌‌ మరోసారి దెబ్బకొట్టాడు. కాసేపటికే ఫించ్‌‌ బౌలింగ్‌‌లో అనవసర షాట్‌‌ ఆడి హఫీజ్‌‌ కూడా పెవిలియన్‌‌ చేరాడు.   షోయబ్‌‌ మాలిక్‌‌(0), ఆసిఫ్‌‌ అలీ(5) కూడా నిరాశపరడంతో 160/6తో పాక్‌‌ ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో  కెప్టెన్‌‌ సర్ఫరాజ్‌‌,  హసన్‌‌ అలీ(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32) స్కోరును రెండొందలు దాటించారు. ధాటిగా ఆడే ప్రయతంలో  హసన్‌‌ అలీ ఔటైనా.. వాహబ్‌‌ రియాజ్‌‌ అనూహ్యంగా చెలరేగాడు. అతను భారీ షాట్లు ఆడడంతో పాక్‌‌ స్కోరు 42 ఓవర్లలో 250 మార్కు దాటగా  ఆసీస్‌‌ శిబిరంలో గుబులు మొదలైంది. కానీ, స్లాగ్‌‌ ఓవర్లలో స్టార్క్‌‌ మరోసారి తనదైన శైలిలో విజృంభించాడు. 45 ఓవర్లో రియాజ్‌‌, ఆమిర్​ (0)ను ఔట్‌‌ చేసి మ్యాచ్‌‌ను లాగేసుకున్నాడు.

వార్నర్‌‌ హిట్‌‌.. అమిర్‌‌ సూపర్‌‌ హిట్‌‌

టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు దిగిన ఆసీస్‌‌కు ఓపెనర్లు కెప్టెన్ ఫించ్‌‌, వార్నర్‌‌ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓ ఎండ్‌‌ నుంచి పేసర్‌‌ అమిర్ నిప్పులు చెరగడంతో తొలి పది ఓవర్లలో 50 రన్సే చేసిన ఆసీస్‌‌ ఓపెనర్లు క్రమంగా పుంజుకున్నారు. సింగిల్స్‌‌, డబుల్స్‌‌ తీస్తూ వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు, సిక్సర్లు కొడుతూ ఫించ్‌‌ ఇన్నింగ్స్‌‌కు ఊపుతెచ్చాడు. 13 ఓవర్లో ఆసిఫ్‌‌ అలీ క్యాచ్‌‌ వదిలేయడంతో లైఫ్‌‌ దక్కించుకున్న ఫించ్‌‌ చెలరేగి ఆడాడు. వార్నర్‌‌ కూడా బ్యాట్‌‌కు పని చెప్పడంతో 22 ఓవర్లకు 146/0తో నిలిచిన ఆసీస్‌‌  400 స్కోరు చేసేలా కనిపించింది. అయితే, సెంచరీ చేసేలా కనిపించిన ఫించ్‌‌ను తర్వాతి ఓవర్లో  ఔట్‌‌ చేసిన అమిర్‌‌ పాక్‌‌కు  బ్రేక్‌‌ ఇచ్చాడు.  వన్‌‌డౌన్‌‌లో వచ్చిన స్టీవ్‌‌ స్మిత్‌‌(10)నిరాశపచగా..  వేగంగా ఆడే ప్రయత్నం చేసిన  మాక్స్‌‌వెల్‌‌(20)ను షాహీన్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. సెంచరీ తర్వాత షాహీన్​ బౌలింగ్‌‌లోనే వార్నర్‌‌ ఔటయ్యాడు. అప్పటికి 38 ఓవర్లో  243/4తో ఆసీస్‌‌ మెరుగైన స్థితిలోనే ఉంది. ఈ దశలోఅమిర్‌‌ షో మొదలైంది. ఒక్కసారిగా విజృంభించిన పాక్‌‌ పేసర్‌‌..  ఖవాజ(18), షాన్‌‌మార్ష్‌‌(23)ను వెనక్కుపంపి కంగారులనుని దెబ్బతీశాడు. టెయిలండర్లతో కలిసి పోరాడిన అలెక్స్‌‌ కారీ(20) స్కోరును మూడొందలు దాటించాడు.49 ఓవర్‌‌లో కారీతో పాటు  స్టార్క్‌‌ (3)ను ఔట్‌‌ చేసిన అమిర్‌‌  ఐదో వికెట్‌‌ను ఖాతాలో వేసుకోవడంతో పాటు ఆసీస్‌‌ ఇన్నింగ్స్‌‌కు ముగింపు పలికాడు.