
మెల్‌బోర్న్: తొలి రెండు మ్యాచ్‌ల కంటే మెరుగ్గా ఆడినప్పటికీ ఆసీస్ గడ్డపై శ్రీలంకకు వైట్‌వాష్ తప్పలేదు. వార్నర్ (50 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 57 నాటౌట్) మళ్లీ చెలరేగగా, ఫించ్ (37), టర్నర్ (22 నాటౌట్) సత్తా చాటడంతో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది కుశాల్ పెరీరా (57) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం ఛేజింగ్‌లో 17.4 ఓవర్లు ఆడిన ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి 145 రన్స్ చేసి సులువుగా మ్యాచ్ గెలిచింది. ఈ సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 100, 60, 57 స్కోర్లు చేసి నాటౌట్‌గా నిలిచిన వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఓ టీ20 సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచిన తొలి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా వార్నర్ రికార్డులకెక్కాడు. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లో 50 అంతకంటే ఎక్కువ రన్స్ చేసిన మూడో ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా నిలిచాడు.