కష్టాల్లో ఆసీస్ ... కళ్లముందు భారీ టార్గెట్

కష్టాల్లో ఆసీస్ ... కళ్లముందు భారీ టార్గెట్

టీ20 వరల్డ్‌కప్‌  2022 సూపర్‌ 12 లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్  జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో కివిస్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు  దిగిన న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కాన్వే 92 పరుగులతో రాణించాడు. తొలి వికెట్‌కు అలెన్‌, కాన్వేలు 56 రన్స్‌ జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు.  కేవలం 3.5 ఓవర్లలోనే కివీస్‌ 50 పరుగుల మార్క్‌ను దాటింది. చివర్లో  జేమ్స్‌ నీషమ్‌ 13 బంతుల్లో 26  చేయడంతో కివిస్ జట్టు భారీ స్కోర్ చేసింది.  

కష్టాల్లో ఆసీస్ 

201 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ కు తొలి ఓవర్ లోనే పెద్ద షాక్ తగిలింది. డేవిడ్ వార్నర్ త్వరగానే ఔట్ అయ్యాడు. 12 బంతుల్లో 16 పరుగుల చేసిన మిచెల్ మార్ష్‌ కూడా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్ లో మాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్ ఉన్నారు. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 39 పరుగులతో ఉంది.