
ఐదుసార్లు వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా 2023 మెగా టోర్నీకి రెడీ అవుతోంది. ప్రపంచకప్‌కు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఖరారు చేసింది.ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్, అలాగే బ్యాటింగ్‌లో జట్టుకు వెన్నెముకగా ఉన్న మార్నస్ లబుషేన్‌లకు వరల్డ్‌కప్ టీంలో స్థానం దక్కలేదు. ఊహించినట్లుగానే, మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, అష్టన్ అగర్‌లతో సహా చాలా మంది ఆల్ రౌండర్లు జట్టులో ఉన్నారు.
ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టు: పాట్ కమిన్స్ (సి), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా, మిచెల్ స్టార్క్.
2023 సెప్టెంబర్ 7న ప్రోటీస్‌తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్‌కు వస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న చెన్నైలోనే రోహిత్ సేనతో వరల్డ్ కప్ పోరాటాన్ని ప్రారంభించనుంది.