ఆరేసిన అశ్విన్..480 పరుగులకు ఆసీస్ ఆలౌట్

ఆరేసిన అశ్విన్..480 పరుగులకు ఆసీస్ ఆలౌట్

అహ్మదాబాద్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ సూపర్ సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా....మహ్మద్ షమీ రెండు వికెట్లు తీసుకున్నాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 

ఖతర్నాక్ ఖవాజా...

ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్లకు 255 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. ఫస్ట్ డే  ఉస్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖవాజ( 251 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 ఫోర్లతో 104 బ్యాటింగ్)  కామెరూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (49 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అజేయంగా నిలిచిన వీరిద్దరు..రెండో రోజు కూడా సమర్థవంతంగా ఆడారు. ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేయగా...కామెరూన్ గ్రీన్ (114) కూడా సెంచరీ సాధించాడు. ఈ జోడీ  ఐదో వికెట్ కు ఏకంగా 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

మలుపు తిప్పిన అశ్విన్..

నిలకడగా ఆడుతున్న కామెరూన్ గ్రీన్ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. 378 పరుగుల వద్ద గ్రీన్ అశ్విన్కు చిక్కాడు. అదే ఓవర్లో అలెక్స్ క్యారీ (0)ని కూడా అశ్విన్ పెవీలియన్ చేర్చాడు.  ఆ తర్వాత మరో ఓవర్లో మిచెల్ స్టార్క్ (6) ను అశ్విన్ ఔట్ చేశాడు. కొద్దిసేపటికే 180 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా అక్షర్ పటేల్ LBWగా పెవీలియన్ చేర్చడంతో ఆస్ట్రేలియా 409 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. 

లియోన్, ముర్ఫీ జిడ్డు బ్యాటింగ్..

ఆసీస్ 8 వికెట్లు కోల్పోయిన తర్వాత త్వరగానే ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ స్పిన్నర్లు లియోన్, ముర్ఫీ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరు అద్బుతమైన బ్యాటింగ్తో  జట్టుకు విలువైన పరుగులు సాధించారు. నాథన్ లియోన్ 96 బంతుల్లో 34 పరుగులు, ముర్ఫీ 61 బంతుల్లో 41 పరుగులు సాధించారు. 9వ వికెట్ కు ఏకంగా 70 పరుగులు జోడించారు. ఈ సమయంలో మరోసారి అశ్విన్ మ్యాజిక్ చేశాడు. వీరిద్దరు వెంట వెంటనే ఔట్ చేయడంతో ఆసీస్..480 పరుగులకు ఆలౌట్ అయింది.