
రాజ్‌కోట్ వేదికగా ఆసీస్, భారత్‌ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వాంఖడే స్టేడియంలో తలదించుకున్న కోహ్లీసేన ఈ మ్యాచ్‌లోనైనా గెలుస్తుందేమో చూడాలి. వన్సైడ్ విక్టరీతో టీం ఇండియాకు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. మరో గెలుపు కోసం ఉవ్విళ్లూరుతుంది. అయితే టీం ఇండియాకు మాత్రం ఈ మ్యాచ్ అత్యంత కీలకం. సొంతగడ్డపై మరో సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే ఇండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఆసీస్ చేతిలో ఈ మ్యాచ్ ఓడితే టీమిండియా సొంతగడ్డపై వరుసగా రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయిన జట్టవుతుంది. రాజ్‌కోట్‌లో నేడు జరిగే ఈ చావారేవో లాంటి మ్యాచ్‌లో టీమిండియా గెలిచి సిరీస్ రేసులో నిలుస్తుందో లేక ఓడిపోయి మరోసారి తలదించుకుంటుందో చూడలి.
జట్లు(అంచనా)
ఇండియా: ధవన్, రోహిత్, రాహుల్(కీపర్), కోహ్లీ(కెప్టెన్), అయ్యర్, కేదార్ జాదవ్, జడేజా, శార్దుల్ఠాకూర్/సైనీ, కుల్దీప్/ చహల్, షమీ, బుమ్రా.
ఆస్ట్రేలియా: ఫించ్(కెప్టెన్), వార్నర్, లబుషేన్, స్మిత్, క్యారీ(కీపర్), టర్నర్, అగర్, కమిన్స్, స్టార్క్, రిచర్డ్సన్, జంపా.
For More News..