
ఈ నెలలో ఇండియా మ్యాచ్ లు లేకపోయినా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి రెండు అగ్ర జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు వన్డే సిరీస్ తో ఫ్యాన్స్ కు వినోదాన్ని అందించనున్నాయి. ఇటీవలే టీ20 సిరీస్ ముగించుకున్న రెండు జట్లు మంగళవారం (ఆగస్టు 19) నుంచి వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్నాయి. బవుమా, రబడా, హెడ్, హాజిల్‌వుడ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్ లో ప్రధాన ఆకర్షణగా మారనున్నారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఆగస్టు 19 న ప్రారంభం కానుంది. మ్యాచ్ లన్నీ ఆస్ట్రేలియాలోని డార్విన్, కైర్న్స్, మెకే వేదికలుగా జరుగుతాయి.
రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా సౌతాఫ్రికా జట్టును నడిపించనున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత బవుమా తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. మరోవైపు కమ్మిన్స్ దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ కెప్టెన్సీ చేయనున్నాడు. టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన డెవాల్డ్ బ్రెవిస్, ర్యాన్ రికెల్టన్ పై అందరి చూపు నెలకొంది. ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ తో పాటు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరం కానున్నాడు. హెడ్, మార్ష్, గ్రీన్, లాబుస్చాగ్నే, ఇంగ్లిస్ రూపంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తుంది. స్టీవ్ స్మిత్, మ్యాక్స్ వెల్ ఈ ఏడాది వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియా ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే.
ALSO READ : టీమిండియాలో చోటు ఖాయం..
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?
ఇండియాలో స్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆన్ లైన్ లో ఈ సిరీస్ ను జియోహాట్‌స్టార్, వెబ్‌సైట్‌లో లైవ్ చూడొచ్చు.
సౌతాఫ్రికా వన్డే జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రీవిస్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రామ్, సెనురన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎన్గిడి, లువాన్-డ్రే ప్రెటోరియస్, ర్యాన్-డ్రే ప్రెటోరియస్, సెయింట్ రౌస్టన్, ఆర్. ప్రేనెలన్ సుబ్రాయెన్
ఆస్ట్రేలియా వన్డే జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ , బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, లాన్స్ మోరిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా