విండీస్పై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్

విండీస్పై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్

విండీస్తో సొంత గడ్డపై జరిగిన టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా కైవసం చేసుుకంది. తొలి మ్యాచ్ లో గెలిచి 1-0తో నిలిచిన ఆసీస్..రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. వెస్టిండీస్పై 31 పరుగుల తేడాతో గెలిచి...సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. 

వార్నర్ హాఫ్ సెంచరీ...
ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌  20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 75 పరుగులు సాధించాడు. టీమ్ డేవిడ్ 20 బంతుల్లో 42 పరుగులతో చెలరేగాడు. మాథ్యూవేడ్, స్టీవ్ స్మిత్ పర్వాలేదనిపించారు.  విండీస్ బౌలర్లలో అల్జరీ జోసెఫ్ 3 వికెట్లు, మెక్ కే 2 వికెట్లు దక్కించుకున్నారు. 

వారెవ్వా 110  మీటర్ల సిక్స్...
ఈ మ్యాచ్‌లో టీమ్ డేవిడ్ చెలరేగి ఆడాడు.  మెరుపు షాట్లతో ఆసీస్ కు భారీస్కోరును అందించాడు. అద్భుతమైన  షాట్లతో ఫ్యాన్స్ క్రికెట్ వినోదాన్నిచ్చాడు. ముఖ్యంగా ఓబెడ్ మెక్‌కాయ్ వేసిన 17వ ఓవర్‌లో మూడు, నాలుగో బంతులను సిక్స్‌లుగా మలిచాడు.  ఇందులో  నాలుగో బంతి ఏకంగా 110 మీటర్ల దూరంలో పడింది. ఈ భారీ సి క్స్‌తో అటు కామెంటేటర్లు..ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే ఓవర్లో  మరో రెండు ఫోర్లు బాదాడు. 

150 కూడా కొట్టలే..
ఆ తర్వాత 179 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన  విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు మాత్రమే చేసి..31 పరుగుల తేడాతో ఓడిపోయింది. జాన్సన్ చార్లెస్ 29 పరుగులు చేయగా..హోసెన్ 25 పరుగులు, బ్రాండెన్ కింగ్ 23 పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు, పాట్ కమ్మిన్స్ 2 వికెట్లు పడగొట్టారు. 

ఆసీస్ కు ఆత్మవిశ్వాసం..
టీ20 వరల్డ్ కప్కు మరి కొన్ని రోజులే మిగిలి ఉండటం...డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుండటంతో..టైటిల్ను నిలబెట్టుకోవాలని కంగారులు పట్టుదలతో ఉన్నారు. బ్యాట్స్మన్, బౌలింగ్ ఫర్ఫెక్షన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విండీస్పై టీ20 సిరీస్ విజయం..ఆసీస్కు మరింత ఆత్మవిశ్వాన్నిచ్చింది.