ఏదన్నా తేడాగా మాట్లాడినా.. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినా .. ఏరా నీ బుర్రకు పురుగు తొలిచిందా అంటూ పెద్దలు అనటం వెరీ కామన్.. అది అదే నిజమైనట్లుంది. ఈ మహిళ బుర్రలో.. బ్రెయిన్ లో పురుగు ఉంది. అది పాములా పొడవుగా ఉంది.. ఎర్ర రంగులో ఉంది.. బ్రెయిన్ లోని ఈ పురుగును ఆపరేషన్ ద్వారా తీసేశారు డాక్టర్లు. పూర్తి వివరాల్లో వెళితే..
వైద్య చరిత్రకు కూడా అందని సంఘటన ఇది. ఒక మహిళ బ్రెయిన్ లో ఒక పురుగు చేరింది. అయితే.. అది ఎలా చేరిందన్నది మాత్రం ఆపరేషన్ చేసి... తీసిన డాక్టర్లకు కూడా మిస్టరీగా మిగిలింది. కానీ.. చాలా పరిశోధనలకు, అనుమానాలకు తావు ఇచ్చింది.
ఆస్ట్రేలియా డాక్టర్లు ఓ మహిళ మెదడులో ఉన్న ప్రత్యక్ష పరాన్న జీవిని ( పాముల పొడవుగా ఉన్న పురుగు)ను గుర్తించి.. ఆపరేషన్ ద్వారా తీసేశారు. ప్రపంచంలోనే ఇది మొదటి కేసు అని చెబుతున్నారు. గతంలో ఇలాంటి తరహా కేసులు ఎప్పుడూ చూడలేదన్నారు డాక్టర్లు.
కొంతకాలంగా జ్ఞాపకశక్తి లోపించడంతో బాధిత మహిళను ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరకు ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. అప్పుడు బయటపడింది. అసలు ఆమె జ్ఞాపకశక్తిని ఎందుకు కోల్పోతుందో గుర్తించారు.
మెదడు ముందు భాగంలో పొడవుగా ఉన్న ఒక పరుగు ఉన్నట్లు గుర్తించారు. ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ అని పిలువబడే 8 -సెంటీమీటర్ల (మూడు- అంగుళాలు) పొడవు ఉన్న రౌండ్‌వార్మ్ ను గుర్తించి..దాన్ని తొలగించేందుకు ఆపరేషన్ చేశారు. ఇలాంటి పురుగులు ఎక్కువగా కంగారూలు, కార్పెట్ పైథాన్‌లలో మాత్రమే కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒక మనిషిలో క్షీరద జాతుల మెదడు కలిగిన మొదటి మహిళ కేసుగా దీన్ని చెబుతున్నారు.
సదరు బాధిత మహిళ తన ఇంటికి సమీపంలో ఉండే చెట్ల పొదల్లో పండ్లు, ఆకులు సేకరించిన సమయంలో ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని ఆస్ట్రేలియా వైద్య నిపుణులు చెబుతున్నారు. పాము (కార్పెట్ పైథాన్) వదిలిన మలంలో పరాన్న జీవి లార్వాతో కలుషితమై ఉన్న ఆకులు లేదా పండ్లను ఆ మహిళ తిని ఉండొచ్చని.. అప్పుడే ఆమె మెదడులో పురుగు తయారీ ఉంటుందని భావిస్తున్నారు.
ముందుగా స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్లకు మెదడులో ఒక తీగ మాదిరిగా కనిపించింది. వాళ్లకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇలా ఉందని అందరూ షాక్ తిన్నారు. ఆ తర్వాత లోతుగా అధ్యాయనం చేయడం మొదలుపెట్టారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా దాన్ని గుర్తించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తరహాలు ఉండవని మాత్రం తాము చెప్పలేమంటున్నారు డాక్టర్లు. అంటే ఇలాంటి కేసులు భవిష్యత్తులోనూ బయటపడే అవకాశం ఉందన్న మాట.
