ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌.. జొకోవిచ్‌‌‌‌‌‌‌‌, సబలెంక, గాఫ్‌‌‌‌‌‌‌‌ కూడా

ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌.. జొకోవిచ్‌‌‌‌‌‌‌‌, సబలెంక, గాఫ్‌‌‌‌‌‌‌‌ కూడా

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌: ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల జోరు కొనసాగుతోంది. 22 ఏండ్ల వయసులోనే కెరీర్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ టోర్నీలో బరిలోకి దిగిన స్పెయిన్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ కార్లోస్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ 7–6 (8/6), 6–4, 7–5తో 19వ సీడ్‌‌‌‌‌‌‌‌ టొమ్మి పాల్‌‌‌‌‌‌‌‌ (అమెరికా)పై గెలిచాడు.నాలుగో సీడ్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ వాకోవర్‌‌‌‌‌‌‌‌ విజయంతో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టాడు. 

కడుపు నొప్పితో జాకుబ్‌‌‌‌‌‌‌‌ మెన్సిక్‌‌‌‌‌‌‌‌ (చెక్) మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను తప్పుకోవడంతో జొకోకు వాకోవర్‌‌‌‌‌‌‌‌ లభించింది. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ) 6–2, 6–4, 6–4తో ఫ్రాన్సిస్కో సెరుండోలో (అర్జెంటీనా)పై గెలవగా, లెర్నర్‌‌‌‌‌‌‌‌ టియెన్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–4, 6–0, 6–3తో డానియెల్‌‌‌‌‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా)కు షాకిచ్చాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ అరీనా సబలెంక (బెలారస్‌‌‌‌‌‌‌‌) 6–1, 7–6 (7/1)తో విక్టోరియా మొబోకో (కెనడా)పై నెగ్గి ముందంజ వేసింది.  కోకో గాఫ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–1, 3–6, 6–3తో ముచోవా (చెక్‌‌‌‌‌‌‌‌)పై,   స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌) 6–2, 6–4తో ఆండ్రీవా (రష్యా)పై గెలిచి  క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.