V6 News

డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్ల వింత చేష్టలు

డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్ల వింత చేష్టలు

దుబాయ్: టీ20 వరల్డ్‌ కప్‌ను తొలిసారి ముద్దాడిన ఆస్ట్రేలియా ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఫుల్‌గా సంబురాలు చేసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 173 రన్స్ టార్గెట్‌ను 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన కంగారూ ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. హార్డ్‌హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విన్నింగ్ షాట్‌ను బౌండరీకి తరలించడంతో గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చారు. ఒకర్నొకరు ఆలింగనాలు చేసుకుని సంబరపడ్డారు. తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో గోల చేశారు. ఈ క్రమంలో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్, ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ ఒక బూటులో డ్రింక్‌ను పోసుకుని తాగారు. సెలబ్రేషన్స్‌లో భాగంగా వాళ్లిద్దరూ ఇలా చేశారు. ఈ వీడియోను ఐసీసీ తమ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.  

మరిన్ని వార్తల కోసం: 

యూట్యూబ్​లో ఇక నో లైక్స్!

పోలీసు స్టేషన్‌లో బైక్‌ను కొట్టేసిన కానిస్టేబుల్

క్రిప్టోపై సానుకూలంగా ప్రభుత్వం!