
వరంగల్: పోలీసు స్టేషన్‌లో ఓ బైకు పోయింది. కాజేసిందెవరో దొంగ అనుకున్నారందరూ. పోలీసులు కూడా అలాగే భావించి ఎంక్వైరీ మొదలుపెట్టారు. కానీ ఆ దొంగతనం చేసింది అదే స్టేషన్‌లో పని చేసే హెడ్ కానిస్టేబుల్ అని తెలిసి అవాక్కయ్యారు. అతడి బండారాన్ని సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టింది. ఈ ఘటన నర్సంపేట పోలీసు స్టేషన్‌లో చోటు చేసుకుంది. నెల రోజుల కింద ఓ దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి బైక్‌ను సీజ్ చేశారు. అయితే కొన్ని రోజులకు ఈ బైక్ కనిపించలేదు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. విషయం తెలిసి షాక్ అయ్యారు. సీజ్ చేసిన బైక్‌ను హెడ్ కానిస్టేబుల్ రవీందర్ ఎత్తుకెళ్లాడని గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.