
వీడియోలకు అడ్డాగా ఉండే యూట్యూబ్‌లో నచ్చిన వీడియోలను లైక్ చేయడం, నచ్చని దాన్ని అన్‌లైక్ చేయడం చాలా మందికి అలవాటే. అయితే ఇక నుంచి యూట్యూబ్‌లో ఆ ఆప్షన్ ఉండదు. ‘లైక్, డిస్లైక్’ల నంబర్‌ను యూట్యూబ్ తొలగించనుంది. అయితే చాలామంది కొన్ని వీడియోలను కావాలని డిస్లైక్ చేస్తున్నారనే ఆలోచనలతో ఈ ఆప్షన్లను తొలగించనుంది. కాబట్టి ఒక వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని డిస్‌లైక్స్ వచ్చాయనే నంబర్ కనిపించకుండా పోతుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ మార్పు యూజర్లకు కనిపించనుంది.