వైజాగ్ టీ20 : భారత్ బ్యాటింగ్

వైజాగ్ టీ20 : భారత్ బ్యాటింగ్

విశాఖ వేదికగా జరిగే భారత్, ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆసిస్ ఫీల్డింగ్ తీసుకుంది. మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.  ఈ మ్యాచ్‌తో మిస్టరీ స్పిన్నర్ మయాంక్ మార్కండె తన టీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేయనున్నాడు.

న్యూజిలాండ్‌ తో చివరి రెండు వన్డేలు, టీ20 సిరీస్‌కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ టీమ్‌ లోకి తిరిగొచ్చాడు. ఇక ఓపెనర్ శిఖర్ ధావన్‌ కు విశ్రాంతినిచ్చి కేఎల్ రాహుల్‌ కు అవకాశం ఇచ్చినట్లు కోహ్లి చెప్పాడు. ఆస్ట్రేలియా తరఫున పీటర్ హ్యాండ్స్‌కాంబ్ టీ20 అరంగేట్రం చేయనున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా అతనే తీసుకోనున్నాడు. ఈ టూర్ లో భారత్ తో రెండు టీ20లు, 5 వన్డేలు ఆడనుంది ఆస్ట్రేలియా. మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

టీమ్స్ వివరాలు..

భారత్- రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్య, ఉమేశ్‌ యాదవ్‌, మయాంక్‌ మార్కండె, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

ఆస్ట్రేలియా – ఆరోన్‌ ఫించ్‌, డీఆర్సీ షార్ట్‌, మార్కస్‌ స్టొయినిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌, పీటర్‌ హ్యాండ్స్‌ కాంబ్‌, ఆస్టన్‌ టర్నర్‌, నేథన్‌ కౌల్టర్‌ నైల్‌, కమిన్స్‌, జే రిచర్డ్‌ సన్‌, జేసన్‌ బెరెన్‌ డార్ఫ్‌, ఆడమ్‌ జంపా