23న మల్లన్న ఆలయంలో వేలం పాట

23న మల్లన్న ఆలయంలో వేలం పాట

కొమురవెల్లి, వెలుగు: మల్లికార్జునస్వామి ఆలయంలో వస్తువుల అమ్మకం, ఇతర సేవలకు సంబంధించి ఈనెల 23న వేలం నిర్వహిస్తున్నట్లు  ఆలయ ఈవో బాలాజీ గురువారం తెలిపారు. తలనీలాలకు లైసెన్స్ హక్కుకు రూ.20 లక్షలు, కొబ్బరికాయలు అమ్ముకునేందుకు రూ.5 లక్షలు, కొబ్బరిముక్కలు పోగు చేసుకునేందుకు రూ.5 లక్షలు, మొక్కుబడి వస్త్రాలు పోగు చేసుకునేందుకు రూ.3 లక్షలు,  ఒడిబియ్యం పోగు చేసుకునేందుకు రూ.3 లక్షలు, శ్రీఎల్లమ్మ అమ్మవారి దేవాలయం వద్ద కొబ్బరి కాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు రూ.2 లక్షలు, కోరమీసాలు, ఇతర మొక్కుబడి వస్తువులు విక్రయించుకునేందుకు రూ.2 లక్షలు, సెల్​ఫోన్లు భద్రపర్చుకునేందుకు రూ.లక్ష, టాయిలెట్ బ్లాకులు నిర్వహించుకునేందుకు రూ.లక్ష, పాదరక్షలు భద్రపర్చుకునేందుకు రూ.50 వేలు, ప్రసాదం తయారీ ప్యాకింగ్ నిర్వహణకు రూ.25 వేలు ధరవత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొన్నాలని సూచించారు. శ్రీమల్లికార్జునస్వామి టెంపుల్ ఈవో పేరు మీద, ఏదైనా నేషనల్ బ్యాంక్ పేరున డీడీ తీసి వేలం పాటలో పాల్గొనాలన్నారు. ఈ వేలంపాటలో పాల్గొనే వారు 21న సాయంత్రం 5 గంటల వరకు మల్లన్న ఆలయంలో రూ.2 వేలు చెల్లించి షెడ్యూల్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.