పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లతో ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లతో ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు కష్టాలు పడుతున్నారు. సంపాదనకు, ఖర్చులకు పొంతనలేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. పొద్దంతా కష్టపడితే వచ్చిన డబ్బు..పెట్రోల్,డీజిల్ కే పెట్టాల్సి వస్తోందంటున్నారు. ఏళ్ల నుంచి డ్రైవింగ్ నే నమ్ముకున్నామని ..వేరే వ్యాపారం చేసుకోలేక.. డ్రైవింగ్ కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్నారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటోలు, క్యాబ్స్  డ్రైవర్లపై మరింత భారం పడుతోంది. కరోనాతో  ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమకు ...ఈ రేట్లు భారంగా మారాయంటున్నారు డ్రైవర్లు. పొద్దున నుంచి రాత్రి దాకా గిరాకీ చేసినా రూ. 300 కూడా రావడం లేదని.. వచ్చిన డబ్బులు పెట్రోల్,డీజీల్ కే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రప్రభుత్వం దీపావళి సందర్భంగా పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ.10  వ్యాట్ తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని డ్రైవర్లు కోరుతున్నారు. నిత్యావసర వస్తువులపై ప్రభావం పడుతోందంటున్నారు.  సరుకులు, కూరగాయ రేట్లు భారీగా పెరిగాయని తెలిపారు.  ఇంటి రెంటు, పిల్లల చదువులు, వెహికల్ మెయింటెనెన్స్ భారంగా మారాయని చెబుతున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటున్నారు క్యాబ్ డ్రైవర్స్, లేదంటే ఉన్న వెహికల్స్ ను అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.