ఇదే సరైన సమయం.. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ట్వీట్..

ఇదే సరైన సమయం.. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ట్వీట్..

తిరుమల కల్తీ నెయ్యి వివాదం తెరపైకి వచ్చిన సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రస్తావన తెచ్చిన సంగతి తెలిసిందే. హిందూ ధర్మ రక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కామెంట్ చేసిన పవన్ ఆ తర్వాత ఆ ప్రస్తావన తేలేదు. అయితే.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు ఇదే సరైన సమయం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. పవన్ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి తిరుమల కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదని.. ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక చిహ్నమని అన్నారు పవన్. తిరుమల లడ్డు కేవలం మిఠాయి మాత్రమే కాదని.. అది అందరిలో ఉండే భావోద్వేగం కాదని అన్నారు. ఒక పవిత్రమైన తిరుమల లడ్డూను ఆప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు ముఖపరిచయం లేని వాళ్లకు కూడా పంచుతామని పేర్కొన్నారు పవన్. 

ప్రతి సంవత్సరం సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారని.. ఇలాంటి సనాతన బావాలు, ఆచారాలను ఎగతాళి చేస్తే హిందువులకు ఎంతో ఆవేదన కలుగుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల నమ్మకాన్ని, విచ్ఛిన్నం చేసినట్లు అవుతుందని అన్నారు. సనాతన ధర్మం కోసం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయటానికి ఇదే సరైన సమయం అంటూ ట్వీట్ చేసారు పవన్.