మెహిదీపట్నం, వెలుగు: ఓ ఆటో డ్రైవర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రమేశ్నాయక్ కథనం ప్రకారం.. టోలిచౌకి హకీంపేట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అయ్యూబ్(25) ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున టోలిచౌకి లిమ్రా హోటల్ సమీపంలో ఓపెన్ గ్రౌండ్ వద్ద ఆటోలో చనిపోయి కనిపించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అయ్యూబ్ మెడకు ప్లాస్టిక్ వైరు బిగించి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
