మర్చిపోయిన బ్యాగును తెచ్చి ఇచ్చాడు

మర్చిపోయిన బ్యాగును తెచ్చి ఇచ్చాడు

నల్లకుంటలో ఆటోడ్రైవర్ నిజాయితీ

నల్లకుంట, వెలుగు: ఆటోలో ఓ ప్యాసింజర్ మర్చిపోయిన బ్యాగును డ్రైవర్ పోలీసు స్టేషన్ అందించిన నల్లకుంట పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఒడిశాకు చెందిన రజనీరంజన్ రావు  హిందీ పీహెచ్ డీ ఎగ్జామ్ రాయడానికి సిటీకి వచ్చాడు.  విద్యానగర్ లో ఎగ్జామ్ సెంటర్ అయిన  హిందీ మహావిద్యాలయానికి ఆటోలో వెళ్లిన రజనీరంజన్ రావు ఎగ్జామ్ హడావిడిలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును ఆటోలో మర్చిపోయాడు. బ్యాగ్ మర్చిపోయినట్టు గమనించిన రజనీరంజన్ రావు వెనక్కి తిరిగి రాగా ఆటో కనబడలేదు. దీంతో స్థానిక నల్లకుంట పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు.

మరోవైపు ఆటో డ్రైవర్ సమ్మయ్య తన ఆటోలో ఓ ప్యాసింజర్ బ్యాగు మర్చిపోయాడని చెప్పి దాని నల్లకుంట పోలీస్ స్టేషన్ లో అందించాడు. దీంతో పోలీసులు రజనీరంజన్ రావుకి ఫోన్ చేసి స్టేషన్ కి పిలిపించారు. ఆటో డ్రైవర్ సమ్మయ్య తెచ్చి ఇచ్చిన బ్యాగును చూపించగా..అది తనదేనని రజనీరంజన్ రావు చెప్పాడు. ఆ బ్యాగులో ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు రైల్వే రిజర్వేషన్ టికెట్స్, కొంత డబ్బు ఉన్నాయన్నాడు. ఆ బ్యాగును బీట్ పోలీసులు శ్రీనివాస రెడ్డి, శంకర్ రజనీరంజన్ రావుకి అందించారు. ఆటోలో మర్చిపోయిన బ్యాగును తిరిగి తెచ్చిన సమ్మయ్యను పోలీసులు అభినందించారు.