ఆటోడ్రైవర్ కన్నీళ్లు : ఐదు గంటలు తిరిగితే.. రూ.40 వచ్చాయి..

ఆటోడ్రైవర్ కన్నీళ్లు : ఐదు గంటలు తిరిగితే.. రూ.40 వచ్చాయి..

బెంగళూరులో 5 గంటల పాటు ఆటో నడిపిన డ్రైవర్​ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ఏడుస్తున్న వీడియో సోషల్​ మీడియాలో  వైరల్​గా మారింది. ఆ వీడియోలోని వివరాల ప్రకారం.. కొంత కాలంగా తనకు డ్రైవింగ్​ చేస్తే తక్కువ డబ్బులు వస్తున్నాయని డ్రైవర్​ ఏడుస్తుండటం వీడియోలో కనిపిస్తుంటుంది. అయిదు గంటల పాటు ఆటో నడిపానని దానికి కేవలం రూ.40 మాత్రమే వచ్చాయని కనీసం డీజిల్​ ఖర్చులు రాలేదని బాధితుడు వాపోయాడు.

మిశ్రమ స్పందనలు..

అయితే ఆటో డ్రైవర్​ బాధపడుతుండటంపై నెటిజన్లు విభిన్నంగా  స్పందిస్తున్నారు. ఆటో వాళ్లు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తారని, మీటర్​ రీడింగ్​ కాకుండా అదనంగా తీసుకుంటూ ప్రజల దగ్గర దోచుకుంటారని కొందరు కామెంట్​ చేయగా.. కేవలం రెండు కిలో మీటర్ల దూరంలో దింపడానికి తన దగ్గర రూ.150 అడిగారని మరో నెటిజన్​ ఆరోపించాడు. ఫ్రీ బస్సు శక్తి పథకం మంచిదేని మరొకరు అన్నారు. మరొకరు ఆయనకు సానుభూతి తెలిపారు.