ఓల్డ్‌సిటీ, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ పోలీసులపైకి పాము విసరడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. చాంద్రాయణగుట్ట పరిధిలోని ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్‌వద్ద శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడన్న అనుమానంతో ట్రాఫిక్ పోలీసులు ఆటోను ఆపి డ్రైవర్ సయ్యద్ ఇర్ఫాన్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో డ్రైవర్‌కు 150 రీడింగ్ రావడంతో ఆటోను సీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
దీంతో డ్రైవర్ ఒక్కసారిగా ఆటోలోని పామును తీసి పోలీసులపైకి విసిరే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు భయాందోళనకు గురై వెంటనే దూరం తప్పుకున్నారు. అనంతరం సయ్యద్ ఇర్ఫాన్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఐదేండ్ల కింద పహాడీ షరీఫ్ లో పాములతో ఫామ్‌హౌస్‌లోకి వెళ్లి యువతులపై లైంగికదాడి చేసి దోచుకున్న యువకుల్లో ఇర్ఫాన్ ఒక నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
