మహిళలకు మట్టి గాజులు అందమే కాదు.. ఆరోగ్యం కూడా.. ఉపయోగాలు ఇవే..!

మహిళలకు మట్టి గాజులు అందమే కాదు.. ఆరోగ్యం కూడా..  ఉపయోగాలు ఇవే..!

 భారతీయ మహిళలు గాజులు ధరించడం ...పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం.. సరే ఇప్పుడంటే ప్యాషన్​ పేరుతో సంప్రదాయాలను పట్టించుకోవడం లేదు కాని.. మహిళల చేతికి మట్టి గాజులు అందమే కాదు.. ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి.  ఇప్పుడు పండుగలతో పబ్బానికో.. ప్లాస్టిక్​ .. లేదా గాజుతో తయారు చేసిన గాజులను తగిలించుకుంటున్నారు.  అసలు పూర్వకాలంలో మట్టి గాజులనే ఎందుకు వేసుకొనే వారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  .! 

హిందూ సంప్రదాయంలో మహిళలు గాజులు ధరించడం అనేది కేవలం అలంకారం మాత్రమే కాదు, దాని వెనుక లోతైన శాస్త్రీయ , ఆరోగ్య కారణాలు దాగి ఉన్నాయి.  మట్టి గాజులు ధరించడం వల్ల శరీరానికి కలిగే మేలు  అంతా ఇంతా కాదు.  మహిళలు మట్టిగాజులు ధరించడం వెనుక ఆరోగ్య కారణాలున్నయని చెబుతున్నారు. 

వేడిని నియంత్రిస్తుంది:  మహిళలు చాలా సేపు పొయ్యి దగ్గర గడుపుతారు.  ఇప్పుడంటే గ్యాస్​ పొయ్యిలు.. ఎలక్ట్రానిక్​ రైస్​ కుక్కర్లు..ఓవెన్​ లు వచ్చాయనుకోండి.  పూర్వకాలంలో కట్టెల పొయ్యిగాని.. బొగ్గుల కుంపటి కాని.. కిరసనాయిల్​ స్టవ్​ గాని వాడేవారు.  వీటిపై వంట ఆలస్యం అవుతుంది. అంతసేపు పొయ్యి దగ్గర ఉండటం వలన శరీరానిని వేడి ఉంటుంది.   మట్టికి చల్లబరచే గుణం ఉంటుంది.  చేతులకు మట్టి గాజులు ధరించడం వలన  పొయ్యి నుంచి వెలువడే వేడి మట్టి గాజులు తగ్గిస్తాయి.  దీని వల్ల శరీరంలో అధిక వేడి తగ్గుతుంది. 

బీపీని తగ్గిస్తుంది:  మట్టి గాజులు రక్తసరఫరాలో అంతరాయాన్ని నిరోధిస్తాయి. తద్వారా..  రక్తపోటును (Blood Pressure) అదుపులోఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వ్యాధి నిరోధక శక్తి:  మట్టిలో అనేక ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల్లో రోగ నిరోధక శక్తి ఉంటుంది.  మట్టిగాజులు చర్మానికి తగులుతూ ఉంటాయి.  అలా తగిలినప్పుడు మట్టి ఖనిజాల్లో  ఉండే ఇమ్యూనిటి పవర్​  ఖనిజాలు చర్మం ద్వారా శరీరంలోకి చేరుతుంది. ప్లాస్టిక్​ గాజులు రసాయనాలతో తయారు చేస్తారు.  ఈ రసాయనాల వలన స్కిన్​ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. 

మనస్సు ప్రశాంతత:  మట్టి నుంచి సహజ వాసన... స్పర్శతో  మనస్సును ప్రశాంతంగా ఉంటుంది.  మానసికంగా ఒత్తిడి.. ఆందోళన తగ్గడంలో మట్టి గాజులు కీలక పాత్ర పోషిస్తాయని పెద్దలు చెబుతారు. 

ప్రకృతితో అనుబంధం:  మానవ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది.  మట్టి గాజులు ధరించడం వలన  ప్రకృతితో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాము.  ఇది శరీరంలోని శక్తిని ఉత్తేజపరుస్తుంది. 

పాజిటివ్​ ఎనర్జీ :  మట్టిని పవిత్రంగా భావిస్తారు. పూజా కార్యక్రమాలు లేదా పండుగల సమయంలో మట్టి గాజులు ధరించడం వల్ల సానుకూల శక్తి (Positive Energy) పెరుగుతుందని పెద్దలు చెబుతారు.

ప్రతికూలతను తొలగిస్తుంది:  చేయి అటూ ఇటూ కదిపేటప్పుడు చేతికి ఉన్న మట్టి గాజులు ఒకదానికొకటి తగిలి సౌండ్​ వస్తుంది.  ఈ శబ్దం ​ మన చుట్టూ ఉండే ప్రతికూలతను తగ్గిస్తుంది.  అంతేకాదు గర్భిణీల విషయంలో లోపల ఉండే శిశువు ఈ శబ్దాన్ని విని ఆనందంగా ఉంటాడట.. అందుకే గర్భిణీలను  పురాణాలు.. దేవుడి కథలు చదవమంటారు. 

పర్యావరణం:  గాజులు ఒక్కోసారి పగులుతాయి.  అవే  మట్టి గాజులు మళ్లీ మట్టిలోనే కలిసిపోతాయి.  అవే మెటల్​ లేదా ప్లాస్టిక్​ గాజులైతే పర్యావరణానికి హాని కలిగిస్తాయి.