తెలుగు పాటలకు గాన కోకిల సుశీలమ్మ కేరాఫ్ అడ్రస్: సీల్ వెల్ సినీ స్వరాలు 80 ఈవెంట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలుగు పాటలకు గాన కోకిల సుశీలమ్మ కేరాఫ్ అడ్రస్: సీల్ వెల్ సినీ స్వరాలు  80 ఈవెంట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్​ రవీంద్రభారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శృతిలయ ఫౌండేషన్ ఎండ్ శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సహకారంతో సీల్ వెల్ కార్పొరేషన్.. సీల్ వెల్ సినీ స్వరాలు  80.. కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య​ అతిథిగా భూగర్భ గనులు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి హాజరయ్యారు.

గాన కోకిల పి. సుశీలమ్మకు క్రౌన్ ఆఫ్ ది మ్యూజిక్ అవార్డ్ఘంటసాల మ్యూజిక్ అవార్డ్ 2026ను ప్రముఖ నేపద్యగాయని విజయలక్ష్మీ.. అలాగే ఉత్తమ ప్రతిభ అవార్డ్ ఫొటో గ్రాఫర్ యాదగిరి గౌడ్ అందుకున్నారు. అనారోగ్య కారణంగా పి.సుశీల కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.

ఈ సభలో మంత్రి వివేక్​ వెంకట స్వామి మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన కళాకారుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శృతిలయా ఆర్ట్స్ అకాడమీ గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిందని... తెలుగు పాటలు అంటే సుశీల గారు కేరాఫ్ అడ్రస్ అని కొనియాడారు. 

►ALSO READ | మహిళలకు మట్టి గాజులు అందమే కాదు.. ఆరోగ్యం కూడా.. ఉపయోగాలు ఇవే..!

సుశీలమ్మ గాత్రానికి అందరూ అభిమానులేనన్న మంత్రి... తన ఫ్యామిలీ ఫారెన్​ ట్రిప్​నకు వెళ్లినప్పుడు సుశీల పిల్లలు కలిశారన్నారు. ఆ సమయంలో సుశీల గారిని కొన్ని కారణాల వలన కలవలేకపోయామన్నారు. కల్చరల్ యాక్టివిటీస్ వల్ల మనిషి ఉత్సాహంగా ఉంటారని... తాను చదువుకొనే రోజల్లో ఇలాంటి  కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనేవాడినని తెలిపారు.. ప్రతీ మనిషి రెగ్యులర్  బిజీ లైఫ్ లో ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమన్నారు.

 వెంకటస్వామి ఫౌండేషన్, విశాఖ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు.. ఫ్రీ ఎడ్యుకేషన్ ..  స్పోర్ట్స్ పరంగా క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు.. ఇలాంటి కార్యక్రమాలకు విశాఖ ఇండస్ట్రీస్ ఎప్పుడు సహకారం అందిస్తుందని తెలిపారు.  ఇతర గాయని, గాయకులను  మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మానించారు.