బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య.. గల్లీలోకి గుంజుకుపోయి కాల్చి చంపిన్రు !

బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య.. గల్లీలోకి గుంజుకుపోయి కాల్చి చంపిన్రు !

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై దురాగతాలు కొనసాగుతున్నాయి. ఒక వార్తాపత్రికకు యాక్టింగ్ ఎడిటర్‌గా ఉన్న 45 ఏళ్ల రాణా ప్రతాప్ అనే జర్నలిస్ట్ను కాల్చి చంపారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో నైరుతి బంగ్లాదేశ్‌లోని జషోర్‌లోని మణిరాంపూర్ ఉప జిల్లాలోని కోపాలియా బజార్ ప్రాంతంలో ప్రతాప్ హత్యకు గురైనట్లు అధికారులు తెలిపారు.

మనోహర్‌పూర్ యూనియన్ పరిషత్ చైర్మన్ అక్తర్ ఫరూక్ మింటు ఈ ఘటనపై మాట్లాడుతూ.. పొరుగున ఉన్న కేశబ్‌పూర్ ఉప జిల్లాలోని అరువా గ్రామానికి చెందిన పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడు రాణా ప్రతాప్ రెండేళ్లుగా కోపాలియా బజార్‌లో ఐస్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు.

సోమవారం సాయంత్రం.. కొంతమంది అతనిని ఐస్ ఫ్యాక్టరీ నుంచి బయటకు పిలిచి, ఒక సందులోకి తీసుకెళ్లి కాల్చి చంపేశారు. ప్రత్యక్ష సాక్షి రిపాన్ హొస్సేన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. దాడి చేసిన వ్యక్తులు బైక్పై వచ్చారని చెప్పాడు.

►ALSO READ | అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

దాడి చేసిన వారు ప్రతాప్తో వాగ్వాదం చేసుకున్నారని, అతని తలపై అనేక రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారని ఆయన చెప్పాడు. ప్రతాప్ శరీరం పక్కన ఏడు బుల్లెట్ కేసింగ్లు దొరికాయి. నరైల్ జిల్లాలో ప్రచురితమయ్యే బిడి ఖోబోర్ అనే దినపత్రికకు రాణా ప్రతాప్ తాత్కాలిక ఎడిటర్‌గా కూడా పనిచేశాడు.

"రాణా ప్రతాప్ మా యాక్టింగ్ ఎడిటర్. ఒకప్పుడు అతనిపై కేసులు ఉన్నప్పటికీ, వాటన్నింటిలోనూ అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ హత్యకు దారితీసిన విషయం నేను చెప్పలేను" అని ఆ వార్తాపత్రిక వార్తా సంపాదకుడు అబుల్ కాషెం అన్నారు.