ముషీరాబాద్, వెలుగు: నగరంలోకి అనాధికారికంగా వస్తున్న ఇతర జిల్లాల ఆటోలపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేపట్టాలని మాజీ సెట్విన్ చైర్మన్ ఇనాయత్ అలీ బాబ్రి డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు, నిధి ఏర్పాటు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ఫార్మల్ లేబర్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఇనాయత్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అక్రమ్ ఖాన్, షేక్ మజీద్, ఉస్మాన్ బిన్, మల్లేశ్, మహ్మద్ కాజా, అబ్దుల్ రహీం, మహమ్మద్ షకీల్ తదితరులు పాల్గొన్నారు.
పాతబస్తీలో ఆటోల బంద్సంపూర్ణం
ఓల్డ్‌సిటీ: మంగళవారం జరిగిన ఆటో బంద్‌కు పాతబస్తీలోని ఆటో యూనియన్లు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఉదయం 5 గంటల నుంచి ఎంజీబీఎస్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, చార్మినార్, శాలిబండ దారుష్ఫా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, ఐఎస్ సదన్, మొఘల్‌పురా, భవానీనగర్, డబీర్‌పురా తదితర ప్రాంతాల్లో ఆటోలు బంద్ నిర్వహించారు.
