ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వోలటాలిటీ!

ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వోలటాలిటీ!

న్యూఢిల్లీ :  ఆటో సేల్స్ డేటా, ఇండియా పీఎంఐ డేటా ఈ వారం విడుదల కానున్నాయి. వీటికి తోడు గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ట్రెండ్స్‌‌‌‌‌‌‌‌, ఫారిన్ ఇన్వెస్టర్ల యాక్టివిటీ మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ను నిర్ణయించనున్నాయి. గత కొన్ని సెషన్లుగా కొత్త గరిష్టాలను టచ్ చేస్తున్న మార్కెట్‌‌‌‌‌‌‌‌లో,  ఈ వారం వోలటాలిటీ కనిపించొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వాల్యుయేషన్స్ పెరిగాయని, ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ బుకింగ్‌‌‌‌‌‌‌‌కు మొగ్గు చూపొచ్చని అన్నారు.  అలానే బ్రెంట్ క్రూడాయిల్ ధరపై, రూపాయ–డాలర్ కదలికలపై ట్రేడర్లు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

‘ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వోలటాలిటీ ఉంటుందని అంచనా వేస్తున్నాం. వాల్యుయేషన్స్ పెరగడంతో కొంత  ఆందోళన పడాల్సిందే. ఇన్వెస్టర్ల ఫోకస్ వర్షాకాలంపై పడింది. రూరల్ ఎకానమీపై వర్షాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. జులైలో కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌కు కీలకం. ప్రభుత్వం ఆర్థిక వృద్ధికి సాయపడే పాలసీలను ప్రకటిస్తుందనే అంచనాలు పెరిగాయి’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మార్ట్‌‌‌‌‌‌‌‌ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ ప్రవేశ్‌‌‌‌‌‌‌‌ గౌర్ అన్నారు. యూఎస్ జాబ్‌‌‌‌‌‌‌‌ డేటా జులై 2 న , యూఎస్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ పీఎంఐ డేటా జులై 3 న విడుదల కానున్నాయి. జులై 2 న ఫెడ్ చైర్మన్ పావెల్ స్పీచ్‌‌‌‌‌‌‌‌ ఉంది.