ఫోమ్‌‌‌‌‌‌‌‌ డిస్పెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో లిక్విడ్ పోస్తే నురగ వస్తది..ఈజీగా చేతులు కడుక్కోవచ్చు..

ఫోమ్‌‌‌‌‌‌‌‌ డిస్పెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో లిక్విడ్ పోస్తే నురగ వస్తది..ఈజీగా చేతులు కడుక్కోవచ్చు..

హ్యాండ్‌‌‌‌‌‌‌‌ వాష్‌‌‌‌‌‌‌‌ లిక్విడ్‌‌‌‌‌‌‌‌తో చేతులు కడగాలంటే నురగ వచ్చేవరకు బాగా రుద్దాలి. కానీ.. ఈ డిస్పెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిక్విడ్‌‌‌‌‌‌‌‌ పోస్తే డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా నురగనే ఇస్తుంది. దాంతో ఈజీగా చేతులు కడుక్కోవచ్చు. దీన్ని ఏఐఎంకేవో అనే కంపెనీ తీసుకొచ్చింది. 

దీనికి ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రారెడ్ సెన్సర్ కూడా ఉంది. అందువల్ల చేతిని డిస్పెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంప్‌‌‌‌‌‌‌‌ కింద పెట్టగానే ఆటోమెటిక్‌‌‌‌‌‌‌‌గా ఫోమ్‌‌‌‌‌‌‌‌ని రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. హ్యాండ్ వాష్ లిక్విడ్ పోసేందుకు ప్రత్యేకంగా 400ఎంఎల్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ఒకసారి ఫుల్‌ చేస్తే 200 కంటే సార్లు ఫోమ్‌‌‌‌‌‌‌‌ని అందిస్తుంది. అంటే ఒక్క హ్యాండ్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌కి 2 ఎంఎల్‌‌‌‌‌‌‌‌ కంటే తక్కువే ఖర్చవుతుంది. దీన్ని బాత్రూమ్‌‌‌‌‌‌‌‌, కిచెన్‌‌‌‌‌‌‌‌.. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫోమ్‌‌‌‌‌‌‌‌ డిస్పెన్స్ చేసేటప్పుడు శబ్దం 40 డెసిబుల్స్‌‌‌‌‌‌‌‌ కంటే తక్కువే వస్తుంది. ఇందులో ఇన్‌‌‌‌‌‌‌‌బిల్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీ కూడా ఉంటుంది. యూఎస్‌‌‌‌‌‌‌‌బీతో చార్జ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి.

ధర: 999