జూన్​లో బండ్ల సేల్స్​ అప్‌‌‌‌...75 శాతం పెరిగిన త్రీవీలర్స్​

జూన్​లో బండ్ల సేల్స్​ అప్‌‌‌‌...75 శాతం పెరిగిన త్రీవీలర్స్​

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్​ రిటెయిల్​ అమ్మకాలు జూన్​2023 లో 10 శాతం గ్రోత్​ రికార్డు చేశాయి. ప్యాసింజర్​ వెహికల్స్​, టూ వీలర్ల సేల్స్​ సైతం పెరిగినట్లు ఫాడా గురువారం వెల్లడించింది.  2023 జూన్​ నెలలో మొత్తం రిటెయిల్​ సేల్స్​ ఏడాది కిందటి 17,01,105 యూనిట్ల నుంచి 18,63,868 యూనిట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ నెలలో ప్యాసింజర్​ వెహికల్స్​ రిటెయిల్​ అమ్మకాలు 5 శాతం పెరిగి 2,95,299 యూనిట్లకు చేరినట్లు పేర్కొంది. అలాగే, టూ వీలర్ల సేల్స్​ సైతం 7 శాతం ఎగసి 13,10,186 యూనిట్లకు చేరాయని వివరించింది. త్రీ వీలర్స్​ అమ్మకాలు భారీగా అంటే 75 శాతం ఎక్కువై 86,511 యూనిట్లకు చేరినట్లు ఫాడా వెల్లడించింది. 

మొత్తం రిటెయిల్​ సేల్స్​లో ​  ఏడాది కిందటి కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్​లో 10 శాతం గ్రోత్​ రికార్డయిందని, కానీ ఇంతకు ముందు నెలతో పోలిస్తే మాత్రం 8 శాతం తగ్గిందని ఫాడా ప్రెసిడెంట్​ మనీష్​ రాజ్​ సింఘానియా చెప్పారు. జూన్​ 2023 లో ట్రాక్టర్ల రిటెయిల్​ అమ్మకాలు 45 శాతం పెరిగాయి. ఈ నెలలో 98,660 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. ఇక కమర్షియల్​ వెహికల్స్​ అమ్మకాలు కొద్దిగానే పెరిగాయి. జూన్​ నెల సేల్స్​ కొంత నెమ్మదించినప్పటికీ, లాంగ్​ టర్మ్​ గ్రోత్​ మెరుగ్గానే ఉంటుందని సింఘానియా చెప్పారు. కొంత మంది ఒరిజినల్​ ఎక్విప్​మెంట్​ మాన్యుఫాక్చరర్ల నుంచి సప్లయ్​పరమైన ఇబ్బందులను టూ వీలర్​ కంపెనీలు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. కొత్త మోడళ్లు, ఫెస్టివల్​ ప్రమోషన్లు వంటివి టూ వీలర్​ అమ్మకాలను భారీగా పెంచలేకపోయాయని సింఘానియా తెలిపారు. మే నెలతో పోలిస్తే టూ వీలర్ల సేల్స్​జూన్​ 2023 లో  12 శాతం తగ్గిపోయాయి.